లంచం అడిగిన అధికారికి నోట్ల దండ.. మత్స్యకారుల వినూత్న నిరసన

-

ఓ ప్రభుత్వ అధికారి లంచం అడిగాడంటూ కొంత మంది.. ఆ ఆఫీసర్​కు నోట్ల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం లేనిదే ఏ పని చేయడం లేదంటూ కలెక్టరేట్‌లో మత్స్యకారులు వినూత్న నిరసనకు దిగారు. జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పల్లికొండ ప్రవీణ్‌ ఆధ్వర్యంలో వివిధ సొసైటీలకు చెందిన మత్స్యకారులు ప్రజావాణిలో కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌బాషాను కలిసి జిల్లా మత్స్యశాఖ అధికారి దామోదర్‌ తీరుపై ఫిర్యాదు చేశారు.

మంగెళ నూతన సొసైటీ, రంగాపూర్‌, కల్వకోట గ్రామాలను బీమారం సొసైటీ నుంచి వేరుచేయడం, వెల్గటూరు తదితర సొసైటీలకు సంబంధించిన ఏ పని లంచం ఇవ్వనిదే చేయడం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే సహకార సంఘాల డైరెక్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో అటుగా వచ్చిన అధికారి దామోదర్‌ మెడలో నోట్ల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు. తాను లంచం అడగడం లేదని అధికారి చెప్పగా తమ ఫోన్లలో ఉన్న వాయిస్‌ రికార్డును వినిపించగా.. తాను ఎవ్వరినీ డబ్బులు అడగలేదని వారి మధ్య గొడవలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని జిల్లా మత్స్యశాఖ అధికారి దామోదర్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news