డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లీగల్ నోటీసులు పంపారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు. వేముల రోహిత్ ఆత్మహత్యకు తాను కారణమని భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నోటీసులు పంపారు రాంచందర్ రావు.

3 రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని, లేదంటే 25 లక్షల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. కాగా రోహిత్ వేముల ఆత్మహత్యలో కీలక పాత్ర పోషించిన రాంచందర్ రావుకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవి ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని భట్టి ఈ మధ్యనే పేర్కొన్నారు. ఈ తరుణంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లీగల్ నోటీసులు పంపారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు.