ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏపీ లో ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎల్లుండి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. పదవ తరగతి ఫలితాల నుంచే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. ఏప్రియల్ 3 నుంచి 18వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
ఈ సారి.. ఆరు పేపర్లే ఉంటాయన్నారు. ఉదయం 9.30 దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించబోమని.. ఎవరికైనా వ్యక్తిగతంగా సరైన కారణం అన్నారు. పరీక్షా కేంద్రాల స్కూళ్ళల్లో ఇతర తరగతులు, పనులు జరగవు… బయటి వారు ఎవరూ పరీక్షా కేంద్ర ప్రాంగణంలో పరీక్ష సమయంలో అడుగు పెట్టడం నిషేధం అని వెల్లడించారు. ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామని.. 6,09, 070 మంది విద్యార్థులు పాల్గొంటున్నారన్నారు. పరీక్షకు హాజరు అవుతున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించామని.. విద్యార్థులు బస్సులో హాల్ టికెట్ చూపించి ఉచిత ప్రయాణ సదుపాయం పొందవచ్చని తెలిపారు. బస్సు రవాణా లేని చోట విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే డీఈఓ ద్వారా ఆర్టీసీకి విఙప్తి చేస్తే ప్రత్యేకంగా బస్సు సదుపాయం కల్పిస్తామని వివరించారు.