ఏపీ విద్యార్థులకు శుభవార్త.. ఇవాళ తల్లికి వందనం నిధులు విడుదల.. ఒక్కొక్కరి అకౌంట్లో 13000

-

Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు అలాగే తల్లిదండ్రులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇవాళ తల్లికి వందనం రెండో విడత డబ్బులు రిలీజ్ చేయబోతోంది. ఇవాళ ఒక్కరోజే మరో 9.51 మందికి తల్లికి వందనం…. పథకం నిధులు విడుదల చేయనుంది. మొదటి విడతలో డబ్బులు రానివారు, కొత్తగా చేరిన విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.13 వేలు జమ చేయనున్నారు.

Thalliki-Vandanam-Scheme-20
Thalliki-Vandanam-Scheme-20

ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్సీ, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేయబోతోంది. అలాగే వార్డు, సచివాలయ కార్యాలయాలకు వచ్చిన ఫిర్యాదుల ద్వారా… మరికొంతమంది ఈ పథకానికి అర్హులని తేలింది. దింతో దాదాపు 1.34 లక్షల మంది కొత్తగా అర్హులు అయ్యారు. వీళ్ళందరికీ ఇవాళ నగదు విడుదల చేయనుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. లబ్ధిదారుల జాబితా పాఠశాలల్లో, వెబ్‌సైట్‌లోనూ చూసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news