ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబును అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కోరారు. నిన్న శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేందుకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడును డ్యాం పైన కలిసి మద్దిమడుగు సమీపంలో వంతెన నిర్మాణ ఆవశ్యకతపై ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చారు.

మద్దిమడుగు ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువమంది భక్తులు వస్తారని వంతెన నిర్మాణం పూర్తయితే 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా… నిన్న శ్రీశైలం డ్యామ్ కు సంబంధించిన గేట్లను లిఫ్ట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది.