ఏపీ రేషన్ కార్డు దారులకు అలర్ట్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కీలక మార్పులు చేస్తోంది. ఇకపై కార్డులోని సభ్యులను తొలగించడానికి కొత్త మార్గదర్శకాలు రిలీజ్ అయ్యాయి. ఉద్యోగం, చదువు, వివాహం లాంటి కారణాలతో వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని కార్డ్ నుంచి తొలగించవచ్చు. అంతేకాకుండా ఆగస్టు నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి రాబోతున్న విషయం తెలిసిందే.

పాత కార్డుల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కార్డులను జారీ చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం గ్రామ సచివాలయంలోని అధికారులను సంప్రదించాలని సూచన జారీ చేశారు. రేషన్ కార్డుల సభ్యుల తొలగింపు ప్రత్యేక గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా అమలు చేయవచ్చు. ప్రజలు సంబంధిత ఆధారాలను సమర్పించి తమ కార్డులోని సభ్యులను తొలగించవచ్చని అధికారులు వెల్లడించారు.