రాష్ట్రంలో ఎప్పుడూ చూడని ప్రగతి, సంక్షేమం కొనసాగుతోంది. అందుకే జగన్ రెడ్డి కడుపు మండుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేసారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. అబద్దాలు, డైవర్షన్ పాలిటిక్స్ ని అలవాటుగా మార్చుకున్న జగన్ రెడ్డి.. తన బురదను ఎదుటివారికి రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సిగ్గు లేకుండా ఒక ఆడపిల్లను వేధించిన అధికారులను వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. మా ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
తప్పు చేసిన వారు పీఎస్ఆర్ అయినా పెద్దిరెడ్డి అయినా శిక్ష తప్పదు అని హెచ్చరించారు. కల్తీ మద్యాన్ని తాపించి వేలాది మంది ఆడబిడ్డల తాళి బొట్టు తెంచి తమదే మంచి విధానమని చెప్పుకోవడం ఆధునిక గోబెల్ జగన్ రెడ్డి కే చెల్లిందని విమర్శించారు. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యం సృష్టించడం పై గతంలో కోర్టులు అనేక మార్లు నీకు, నీ గత ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి మరిచిపోయావా..? జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు.