ఇవాళ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు అవుతాయి. ఈ సందర్భంగా మూలపేట ఓడ రేవు నిర్వాసితులకు సహాయ, పునరావాసం, బలవర్ధకమైన బియ్యం పంపిణీ, దిశా బిల్లు పై ప్రశ్నలు ఉండనున్నాయి.
దేవాలయ భూముల పరిరక్షణ, జల్ జీవన్ మిషన్, నవ రత్నాలు – పేదలందరికీ ఇళ్ళు, అంశాల పై ప్రశ్నలు ఉంటాయి. అలాగే…నూతన వైద్య కళాశాలల్లో ఫీజులు, మహిళా సాధికారత అంశాల పై ప్రశ్నలు అడగనున్నారు ఏపీ ఎమ్మెల్యేలు.
అటు ఇవాళ ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్నాయి శాసన మండలి సమావేశాలు. ప్రశ్నోత్తరాల సమయంతో పెద్దల సభ ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ రుణాలు, కేజీ బేసిన్ లో భూగర్భ జలాల కలుషితం, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు, కళ్యాణ్ మస్తు, హజ్ యాత్ర, డీఎస్సీ నోటిఫికేషన్ అంశాల పై మండలిలో ప్రశ్నలు ఉంటాయి.