అమరావతిపై చంద్రబాబు మరో అడుగు వేశారు. అమరావతి రాజధానిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. 2014-19 మధ్య కాలంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు చేపట్టిన నాటి టీడీపీ ప్రభుత్వం…ఇప్పుడు అమరావతి రాజధానిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించింది.
గత ఐదేళ్ల కాలంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్…అటకెక్కింది. రూ. 930 కోట్లతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. ఐదేళ్ల జాప్యం వల్ల సుమారు రూ. 200 కోట్లకు పైగా పెరిగింది హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కాస్ట్. జుడిషియల్ ప్రివ్యూకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు టెండర్లు పిలువనుంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పిలవనుంది సీఆర్డీఏ. 12 టవర్లల్లో 1200 అపార్టుమెంట్లు నిర్మించేలా ప్రణాళికలు చేపట్టనుంది. G+18 పద్దతిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుంది.