ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు ఏపీ అతలాకుతలమైంది. ముఖ్యంగా అమరావతి, విజయవాడ నగరాలు చిన్నాభిన్నమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో అధికార కూటమి నేతలు, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మంత్రి లోకేష్ వైసీపీ పై మండిపడ్డారు. వరద ముంపునకు కూటమి ప్రభుత్వమే కారణం అంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీ కుట్రలు బయటపడకుండా ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లక్షలాది మంది జలసమాధి అయ్యేవిధంగా సైకో జగన్ పన్నిన కుట్ర బట్టబయలు అయిందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో లోకేష్ పోస్ట్ చేశారు. అధికారం అండతో సైకో జగన్ ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయేవిధంగా చేసి 50 మందిని చంపారని.. 5 గ్రామాలను నామరూపాలు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీ కొని కూల్చివేయాలని కుట్ర చేశారు. విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపాలు లేకుండా చేసి లక్షల మంది జలసమాధి అయ్యేవిధంగా జగన్ పన్నిన కుట్ర బట్టబయలు అయింది. దీనిని ప్లాన్ చేసింది జగన్ అయితే.. అము చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ అని ట్వీట్(ఎక్స్)లో పేర్కొన్నారు లోకేష్.