కూటమి సర్కార్ కు బిగ్ రిలీఫ్…సి.రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవం కావడం ఖాయం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థులుగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు అభ్యర్థులు సి.రామచంద్రయ్య, హరిప్రసాద్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల నామినేషన్ దాఖలకు నేడు చివరి రోజు.
ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థుల ఖరారు అయ్యారు. ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్. ఇక అటు సి.రామచంద్రయ్యకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది తెలుగుదేశం. మరో స్థానo జనసేనకు కేటాయించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ కు అవకాశం కల్పించింది జనసేన. అయితే…శాసనసభలో కూటమికి ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా ఏకగ్రీవం కానుంది సి.రామచంద్రయ్య, హరిప్రసాద్ ఎన్నిక.