ఏపీ ఎన్నికల్లో సిరా వివాదం…ఎన్నికల సంఘం కీలక ప్రకటన !

-

ఏపీ ఎన్నికల్లో సిరా వివాదం చోటు చేసుకుంది. అయితే… దీనిపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును విని యోగించుకోకుండా చూడాలనే కుట్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఖండించారు.

The ink controversy in AP elections

చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news