CM Revanth Reddy playing football: ఫుట్ బాల్ ఆడుతున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడుతున్నారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే… తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడటంపై బీఆర్‌ఎస్ పార్టీ ఫైర్ అవుతోంది.
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆటకు పర్మిషన్ ఇచ్చారు కానీ.. కేసీఆర్ దేవరకొండ పర్యటనకు పర్మిషన్ ఇవ్వలేదని ఆగ్రహిస్తున్నారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ నాయక్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్ మరణం పట్ల వారికి నివాళులు అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు దేవరకొండకి రావడాన్ని..ఎన్నికల కోడ్ పేరిట జిల్లా కలెక్టర్ అనుమతించకపోవడంతో కేసీఆర్ పర్యటన రద్దు అయ్యింది. దీంతో రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడటంపై బీఆర్‌ఎస్ పార్టీ ఫైర్ అవుతోంది.