ఏపీ రైతులకు గుడ్ న్యూస్..త్వరలోనే కొత్త కౌలు రైతు చట్టం అమలు

-

ఏపీ రైతులకు గుడ్ న్యూస్..త్వరలోనే కొత్త కౌలు రైతు చట్టం అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు వ్యవసాయ మంత్రి అచ్చెనాయుడు. మండలిలో వ్యవసాయ మంత్రి అచ్చెనాయుడు మాట్లాడుతూ… రైతుకు కులం అంట గట్టింది గత ప్రభుత్వం అంటూ ఫైర్‌ అయ్యారు. 2019లో కౌలు రైతులకు తెచ్చిన చట్టం రద్దు చేస్తామని… 2016లో అమలు చేసిన కౌలు రైతు చట్టం అమలు చేస్తామని ప్రకటించారు వ్యవసాయ మంత్రి అచ్చెనాయుడు.

The new Tenant Farmer Act will be implemented soon

ప్రతి కౌలు రైతుకి రుణాలు, సాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది రైతులకు ప్రభుత్వం మంచి ఇన్స్యూరెన్స్ పథకం అమలు చేస్తామని… ఈ ఏడాది వరకు పాత విధానంలో మాత్రమే ఇన్స్యూరెన్స్ అమలు చేస్తామని వెల్లడించారు. కేంద్రం సాయంతో వచ్చే ఏడాది మంచి ఇన్స్యూరెన్స్ పథకం అమలు చేసి రైతులకు మరింత మేలు చేస్తామని వివరించారు. దీనివల్ల ఖరీఫ్, రబీ సమయంలో కూడా రైతులు నష్టపోకుండా ఇన్స్యూరెన్స్ అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. బెస్ట్ ఇన్స్యూరెన్స్ పథకం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం… 2016 నుంచి 2019 వరకు అందిన విధంగా ఇన్స్యూరెన్స్ ప్రయోజన ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news