ఈ 3 కేంద్ర ప్రభుత్వ స్కీంలలో పెట్టుబడి పెడితే లాభాలే లాభాలు..

-

ఎన్ని ప్రైవేట్ బ్యాంకులు వచ్చినా, ఎన్ని ఫైనాన్స్ కంపెనీలు వచ్చిన ప్రజలకు మాత్రం పోస్ట్ ఆఫీసులపై ఏమాత్రం నమ్మకం తగ్గడం లేదు. దీనికి ప్రధాన కారణం పోస్ట్ ఆఫీసులని భారత ప్రభుత్వం నడపడమే. వీటిల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వమే మీకు గ్యారెంటీగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం పోస్ట్ ఆఫీసులో అనేక రకాల స్కీములను ప్రవేశపెడుతూ ఉంటుంది. వీటిలో చాలా రకాల స్కీములు తమ కస్టమర్లకు గ్యారెంటీ రిటర్న్స్ ను అందిస్తూ ఉంటాయి. మీరు పోస్ట్ ఆఫీస్ లో మంచి లాభాల కోసం సరైన పథకాల కోసం చూస్తున్నట్లయితే పోస్టల్ బ్యాంకులో అందిస్తున్న ముఖ్యమైన మూడు పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు బ్యాంకుల కన్నా కూడా ఎక్కువ వడ్డీ ఆదాయం పొందే బంపర్ అవకాశం ఉంటుంది.

post office

మొదటిది మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీం.. ఇది మహిళల్లో పొదుపును ప్రోత్సహించేందుకు సూచించిన ఒక పథకం. ఈ పథకం ద్వారా మీరు రెండు సంవత్సరాల కాలం వ్యవధికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో సంవత్సరానికి 7.5% వడ్డీని అందిస్తారు. ఇతర పథకాలతో పోల్చి చూసినట్లయితే ఈ పథకం చాలా ఎక్కువ అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల కూడా ఈ స్థాయిలో వడ్డీని అందించడం లేదు. ఇక మీరు ఈ స్కీంలో కనీసం రూ. 1000 నుంచి రూ. 2 లక్షల రూపాయల దాకా డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే అందుకు గాను రెండు సంవత్సరాల తరువాత సుమారు రూ.1,16,000 రూపాయలు పొందే వీలుంది.

రెండోది నేషనల్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్ స్కీం… పోస్ట్ ఆఫీస్ లో ఈ నేషనల్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్ స్కీం కింద మీరు డబ్బులను పొదుపు చేసినట్లయితే, మీకు బయట ప్రైవేటు వడ్డీల కన్నా కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు లభిస్తాయి. ఇంకా ఈ స్కీములో మీకు గరిష్టంగా 7.5% దాకా వడ్డీ లభించే అవకాశం ఉంది.

మూడోది సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం.. ఇక ఈ స్కీములో అయితే సీనియర్ సిటిజన్స్ పొదుపు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీము పై కూడా అత్యధిక మొత్తంలో వడ్డీ లభిస్తుంది. ఇందులో మీరు గరిష్టంగా 30 లక్షల దాకా పెట్టుబడిని పెట్టవచ్చు. దీనిపై వడ్డీ రేటు విషయానికి వస్తే.. 8.2 % గా ఉంది. ఈ పథకంలో ఉదాహరణకు మీరు రూ. 1 లక్ష రూపాయలు కనుక పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల తర్వాత 1,41,000 రూపాయలు మీకు లభిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news