ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో భోజనం బాలేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏపీ అసెంబ్లీలో ఇచ్చే భోజనం సరిగా లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఫిర్యాదు చేశారట పలువురు ఎమ్మెల్యేలు.

దీంతో ఏపీ అసెంబ్లీలో భోజనం బాలేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారట. ఎమ్మెల్యేలంటే తమాషాగా ఉందా? భోజనం బాగుందని ఒక్క ఎమ్మెల్యే అయినా చెప్పారా? అంటూ మండిపడ్డారు. మీ ఇష్టానుసారంగా చేస్తారా? పద్దతి మార్చుకోవాలంటూ అధికారులు, ఫుడ్ కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు…ఈ మేరకు బాగా వంటలు చేయాలని ఆదేశించారట. ఇక పై ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతే.. చర్యలు తప్పవని హెచ్చరించారట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు.