రైతు భరోసా నిధుల విడుదలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రైతు భరోసా మొదలు పెడతామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అప్పుడు రైతు భరోసా నిధుల విడుదల ఉంటుందని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
యాదాద్రి జిల్లా.. రామన్నపేట ను కొత్త మార్కెట్ గా పునరుద్ధరణ చేస్తాం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. BRS ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ఏ పథకాన్ని అమలు చేయలేదు. అందువల్ల సహకార సంఘాలు కోట్ల రూపాయలు నష్టపోయాయి. చేనేతకు పెండింగులో ఉన్న నిధులను త్వరలోనే మంజూరు చేస్తాం. చేనేత ద్వారా తెలంగాణ లో ఉన్న ప్రతి మహిళలకు చీరలు ఇస్తాం. చేనేత వృత్తి మీద బ్రతికే కుటుంబాల కోసం వాళ్ళ అప్పులను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుందన్నారు.