శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుకుంటున్న వరద ప్రవాహం…!

కృష్ణా నది ఎగువ ప్రాంతాల లో భారీగా వర్షాలు కురవడంతో ఆ ప్రాంతాల నుంచి వస్తున్న నీటికి హంద్రీనీవా జూరాల ప్రాజెక్టు నుండి నేను విడుదల చేయడంతో శ్రీశైల జలాశయానికి ఆ నీరు చేరుకుంటుంది. దీంతో జలాశయానికి వరద ప్రవాహం రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా, తాజాగా 80 వేల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయం లో కి వచ్చి చేరగా గురువారం నాటికి జలాశయంలో 820 అడుగులకు నీటి మట్టం చేరుకుంది.

srisailam-dam
srisailam-dam

అధికారులు తెలిపిన సమాచారం మేరకు మరో రెండు రోజుల పాటు శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు కొనసాగుతుందని వారు తెలుపుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 255 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 41 టిఎంసిల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. అయితే జూరాల ప్రాజెక్టు వద్ద 62 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా తొమ్మిది గేట్ల ద్వారా 82 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. అలాగే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతుండడంతో మరింత ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు.