విజయవాడ దుర్గగుడికి కల్తీ సరుకులు సరఫరా చేసినట్లు..వెలుగులోకి షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. విజయవాడ దుర్గగుడికి నాసిరకం సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్ పై చర్యలకు రంగం సిద్ధం అయింది. సాయి మణికంఠ ఏజెన్సీ ద్వారా సరుకులు సరఫరా అవుతున్నట్టు గుర్తించారు. గతంలో కూడా అన్న ప్రసాదానికి నాసిరకం బియ్యం సరఫరా చేసినట్టు గుర్తించారు.
లలితా బ్రాండ్ బియ్యం బదులు డింగ్ డాంగ్ బ్రాండ్ బియ్యం సరఫరా చేయటంపై అప్పట్లో సీరియస్ అయింది సర్కార్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పలు ఆలయాలకు సరుకులు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. ఆయా ఆలయాలలో కూడా సరుకులు ఎలా సరఫరా చేస్తున్నారో పరిశీలనకు నిర్ణయం తీసుకున్నారు. దుర్గగుడి లో కొందరు అధికారుల సహకారంతో వ్యవహారం నడుపుతు న్నట్లు గుర్తించినట్టు సమాచారం అందుతోంది.
ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో 1110 కిలోల జీడిపప్పు, 700 కిలోల కిస్మిస్ FSSAI నిబంధనలకు విరుద్ధంగా పంపటంతో వెనక్కి పంపారు అధికారులు. నాణ్యత లేకుండా సరుకులు సరఫరా చేస్తున్న వారిని బ్లాక్ లిస్ట్ పెడతానని నిన్నే స్పష్టం చేసిన దేవాదాయ శాఖ కమిషనర్… కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.