అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే అప్పటి సీఎం పట్టించుకోలేదు – మంత్రి నిమ్మల

-

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో లెఫ్ట్ బండ్ మూడు గండ్లు పూడ్చామని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఎంత ఎక్విప్మెంట్ అయినా వినియోగించుకోమని చంద్రబాబు చెప్పారని తెలిపారు. తీవ్ర గాలులను సైతం లెక్కచేయకుండా పనులను పూర్తి చేశామన్నారు. మిలటరీ సైతం తమ పనులను అభినందించిందని తెలిపారు నిమ్మల.

ఎన్డీఏ ప్రభుత్వం కమిట్మెంట్ కారణంగానే ఇదంతా సాధ్యమైందని.. చంద్రబాబు కలెక్టరేట్ లో ఉండి రెండు గంటలు కూడా నిద్ర పోలేదన్నారు. మా ప్రభుత్వంలో మంత్రులు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటున్నారని తెలిపారు. బుడమేరుకు మరో ఎనిమిది వేల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారని తెలిపారు నిమ్మల రామానాయుడు.

అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఆరోపించారు. బుడమేరును ఐదేళ్లలో జగన్ పట్టించుకోలేదని.. ఇప్పుడు 35 వేల క్యూసెక్కులు ప్రవహించేలా చంద్రబాబు టెండర్లు పిలిచారని తెలిపారు. ఇక వెలగలేరు హెడ్ రెగ్యులరేటర్ 11 గేట్లు వరద ఉధృతి ఆధారంగా లిఫ్ట్ చేసామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news