ఎమ్మెల్సీ అనంత బాబుకు ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ ఉచ్చు..బిగుస్తోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంత బాబుపై కేసు రీ-ఓపెన్ చేశారు. కేసు విచారణ అధికారిగా SDPO మనీష్ దేవరాజ్ పాటిల్ ను నియమించారు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్.

60 రోజుల్లో దర్యాప్తు నివేదికను డీజీపీకి, కాకినాడ జిల్లా ఎస్పీకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే అదనపు ఛార్జ్ షీట్ వేయాలని ఆదేశించారు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్. న్యాయ సలహాల కోసం ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ళ సుబ్బారావును నియమించింది ప్రభుత్వం. 2022 మే 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేయడంతో కేసు సంచలనంగా మారింది.