టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో కలకలం చోటు చేసుకుంది. టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు భరించలేక టీడీపీ ఆఫీస్‌లో దాసరి బాబురావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే మణిపాల్ హాస్పిటల్‌కి తరలించింది తెలుగుదేశం పార్టీ సిబ్బంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా , ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజీగా గడపనున్నారు. నేడు పలువురు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ ఉ.10:30 గంటలకు సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ ఉంటుంది. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై చర్చ ఉంటుంది. ఉ.11:15 గంటలకు అర్జున్‌రామ్ మేఘ్వాల్‌తో చంద్రబాబు నాయుడు సమావేశం జరుగనుంది. కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చర్చ ఉంటుంది. మ.12 గంటలకు పీయూష్ గోయల్‌తో చంద్రబాబు భేటి ఉంటుంది. మ.1:40 గంటలకు అమిత్‌షాతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం ఉంటుంది.
టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు భరించలేక టీడీపీ ఆఫీస్‌లో దాసరి బాబురావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వెంటనే మణిపాల్ హాస్పిటల్‌కి తరలించిన తెలుగుదేశం పార్టీ సిబ్బంది pic.twitter.com/cNIUfgeKLb
— Telugu Scribe (@TeluguScribe) April 21, 2025