రేపు జరపాల్సిన లోకేష్ విచారణ ఈ నెల 10 కి వాయిదా..!

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ సీఐడీ విచారణ  ఈనెల 10కి వాయిదా పడింది. ఈ మేరకు సీఐడీకి  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేశారు. లోకేష్‌ ఇచ్చిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ఈరోజు(మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది. లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్‌లో షేర్ హోల్డర్ అని లోకేష్ తరపు న్యాయవాదులు చెప్పారు. ఆయనకు తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని తెలిపారు.

లోకేష్‌ను ఇవి అడగడం సమంజసం కాదని సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని, రేపే (బుధవారం) విచారణకు హాజరుకావాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. అంత తొందర ఏముందని లోకేష్ తరపు న్యాయవాది పోసాని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనల అనంతరం ఈనెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు చేసింది. 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని ఆదేశించింది. న్యాయవాదిని అనుమతించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. మధ్యాహ్నం గంటపాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news