నేడు గుంటూర్ ప‌ర్య‌ట‌న‌లో ఉప రాష్ట్రప‌తి.. షెడ్యూల్ ఇదే

-

భార‌త ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు నేడు ఆంధ్ర ప్ర‌దేశ్ లోని గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. గుంటూర్ లోని ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు పాల్గొన‌నున్నారు. ఈ ప‌ర్య‌టన కోసం ఉప రాష్ట్ర ప‌తి వెంక‌య్య నాయుడు ఇప్ప‌టికే విజ‌య‌వాడ చేరుకున్నారు. నిన్న సాయంత్రం గ‌న్న‌వరం ఎయిర్ పోర్ట్ లో గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్ తో పాటు మంత్రి వెల్లంప‌ల్లి ఉప రాష్ట్రప‌తికి స్వాగ‌తం ప‌లికారు.

కాగ ఈ రోజు ఉప రాష్ట్రప‌తి.. ఉద‌యం 8:30 గంట‌లకు గుంటూర్ లోని పాటి బండ్ల సీత‌రామ‌య్య ఉన్న‌త పాఠ‌శాలకు చేర‌కుంటారు. పాఠ‌శాల వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో ఆయ‌న పాల్గంటారు. అనంత‌రం 10:45 గంట‌ల‌కు లక్ష్మిపూరం లో గ‌ల హై కోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రామ కృష్ణ ప్ర‌సాద్ ఇంటికి వెళ్తారు. అక్క‌డ కొంత స‌మ‌యం గ‌డిపిన త‌ర్వాత.. బృందావ‌న్ గార్డెన్స్ లోని అన్న‌మ‌య్య గ్రంథాల‌యాన్ని ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు సంద‌ర్శిస్తారు. అనంత‌రం 11:50 వెంక‌య్య నాయుడు త‌న మిత్రుడిని క‌లుసుకుంటారు.

అక్క‌డ నుంచి 12:30 గంట‌ల‌కు మంగ‌ళ‌గిరిలోని సీ.కే క‌న్వెన్షన్ సెంట‌ర్ కు చేరుకుంటారు. అక్క‌డే విశ్రాంతి తీసుకుని.. అక్కడ సాయంత్రం 3 గంట‌ల‌కు జ‌రిగే రామినేని ఫౌండ‌షన్ పుర‌స్కార కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 4:15 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌కు బ‌యలు దేరి వెళ్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version