ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ద భేరీ మోగించిన విషయం తెలిసిందే. రష్యా బలగాల దాటికి ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. లక్షల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు దేశం విడిచి పోతున్నారు. అంతే కాకుండా.. బాంబుల దాడిలో వందల మంది సైనికులు, పౌరులు మృతి చెందుతున్నారు. అలాగే భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో ఉక్రెయిన్ కు సాయం చేయడానికి ఏ దేశాలు కూడా ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు రష్యా పై ఉక్రెయిన్ ఓంటరిగానే పోరాటం చేస్తుంది.
కాగ ప్రస్తుతం తమ దేశానికి ఇతర దేశాల మద్దతు అవసరం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భావించారు. అందు కోసం జెలెన్ స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూరోపియన్ యూనియన్ లో చేరడానికి అంగీకరించారు. అంతే కాకుండా దానికి సంబంధించిన అప్లికేషన్ పై కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంతకం కూడా చేశారు. కాగ గత కొద్ది కాలం నుంచి యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి కోరుతున్నారు. కాగ తాజా గా అప్లికేషన్ లో సంతకం పెట్టడంతో చరిత్రక క్షణమని ఉక్రెయిన్ పార్లమెంట్ తెలిపింది.