మాట నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబును కాకినాడ జిల్లాకు చెందిన బాధిత మహిళా ఆరుద్ర కలిశారు. దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు రూ. 10 వేల పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఆరుద్ర కుమార్తె వైద్యానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించారు సీఎం చంద్రబాబు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక సాయం అందక, కుమార్తెకు వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆరుద్ర. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గన్మెనుతో పాటు వైసీపీ నేతల దాడిలో గాయపడిన బాధిత మహిళ ఆరుద్ర, ఆమె కుమార్తె వైద్యానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఆమె ఆస్తి వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.