వైసీపీ నుంచి ప్రాణ‌హాని ఉంద‌న్న ఆర్ఆర్ఆర్‌..

న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను హ‌నీట్రాప్ చేయాల‌ని చూస్తున్నార‌ని, కానీ తాను అందులో ప‌డ‌బోనంటూ బాంబు పేల్చారు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రిని ఉద్దేశించి అన్నార‌నేదేగా మీ డౌట్‌. ఇంకెవ‌రి గురించి అండి ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఓ మ‌హిళ‌తో త‌న‌కు మెసేజ్‌లు చేయిస్తున్నార‌ని ఆరోపించారు.

స‌జ్జ‌ల త‌న‌ను టార్గెట్ చేశార‌ని, వంద‌ల మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటూ మండి ప‌డ్డారు. త‌న‌పై కేసులు పెట్టాల‌ని చూస్తున్నార‌ని, ప్ర‌భుత్వం అంతు చూస్తాన‌ని చెప్పారు. సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర కూడా త‌న మనుషులు ఉన్నార‌ని, ప్ర‌తీదీ త‌న‌కు తెలుస‌ని చెప్పారు.

వైసీపీ ప్ర‌భుత్వం నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని, ఈ మేర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిపారు. సీఎం జ‌గ‌న్‌పై కూడా ఆరోప‌ణ‌లు చేశారు. ఇష్టం ఉన్న‌ట్టు చేస్తే కోర్టుల తేల్చుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు జ‌గ‌న్ ఎక్క‌డా క‌నిపించ‌ట్లేద‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం వేస్తున్న అన్ని వేశాల‌ను కోర్టులు గ‌మ‌నిస్తున్నాయ‌ని హెచ్చ‌రించారు.