దేశంలో నగదు రహిత లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం కూడా నగదు లావాదేవీలపై దృష్టి సారించింది. ముఖ్యంగా అనుమతించిన పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే నోటీసులు ఇస్తామని ఇది వరకే హెచ్చరికలు జారీ చేసింది. అందువల్ల ప్రజలు అనుమంతిన మేర మాత్రమే నగదు లావాదేవీలు చేయాలి. లేదంటే ఐటీ విభాగం నోటీసులు పంపిస్తుంది. తరువాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఏయే నగదు లావాదేవీలకు పరిమితులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బ్యాంకుల్లో గరిష్టంగా రూ.10 లక్షల మేర మాత్రమే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. అంతకు మించితే ఆదాయపు పన్ను శాఖ వారు నోటీసులు పంపిస్తారు.
2. రియల్ ఎస్టేట్ చేసే వారు గరిష్టంగా రూ.30 లక్షల మేర నగదు లావాదేవీలు చేయవచ్చు. పరిమితి దాటితే చెక్కులు, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నగదు లావాదేవీలు చేయాలి. రూ.30 లక్షల పరిమితి దాటితే ఐటీ విభాగం ప్రశ్నిస్తుంది. అవసరం అయితే నోటీసులు పంపిస్తుంది. కనుక పరిమితికి లోబడి లావాదేవీలు చేయాలి.
3. బ్యాంకుల్లో సేవింగ్ అకౌంట్లలో క్యాష్ డిపాజిట్ లిమిట్ రూ.1 లక్ష కాగా కరెంట్ అకౌంట్‌లకు క్యాష్ డిపాజిట్ లిమిట్‌ను రూ.50 లక్షలుగా నిర్ణయించారు. ఆ లిమిట్ దాటితే ఐటీ శాఖ నోటీసులు పంపిస్తుంది.
4. మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు రూ.10 లక్షలు దాటరాదు.
5. క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించే వారు రూ.1 లక్ష వరకు క్యాష్‌తో చెల్లించవచ్చు. పరిమితి దాటితే ఆన్‌లైన్‌లో చెల్లించాలి. లేదంటే నిబంధనలను ఉల్లంఘించిన వారు అవుతారు. ఐటీ విభాగం నోటీసులు జారీ చేస్తుంది.