ఏపీలో చాలా భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు వైసీపీ నిండుకుండలా కనిపిస్తోంటో మరోవైపు ఘనమైన చరిత్ర కలిగిన టీడీపీ మాత్రం ఎండిపోయిన చెరువులా తయారవుతోంది. వైసీపీలో చిన్న కార్యకర్త కూడా నాయకుడిలా కనిపిస్తుంటే టీడీపీలో మాత్ంర కనీసం నియోజకవర్గాల్లో కూడా పార్టీని ముందుండి నడిపించే వారు కరువయ్యారు. ఇప్టపికే ఏవేవో కారణాలతో నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారంతా కూడా పార్టీని వీడుతుంటే ఇంకొందరేమో తటస్థంగా వ్యవహరిస్తూ సైలెంట్ గా ఉంటున్నారు.
ఇక మరీ ముఖ్యంగా ఎస్సీ రిజర్వుడ్ అయిన నియోజకవర్గాల్లో అయితే టీడీపీకి క్యాండిడేట్ స్థాయిలో ఉండే నాయకులు దొరకట్లేదంట. ఆ నియోజకవర్గాల్లో చాలా వరకు వేరే వర్గాలకు చెందిన వారే దిక్కయ్యారు టీడీపీకి. ఉదాహరణకు చూస్తే ప్రత్తిపాడు నియోజకవర్గంతో పాటు బాపట్లలో ఎస్సీ నేతలు టీడీపీకి దొరకట్లేదు. అలాగే కృష్ణాజిల్లాలోని పామర్రు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేరే వర్గాల కు చెందిన వారు ఏలుతున్నారు.
రిజర్వుడ్ ఏరియాల్లో ఆ వర్గం వారు ఉంటేనే పార్టీ బతుకుతుంది. లేదంటే పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతోంది. తిరువూరు లాంటి నియోజకవర్గాల్లో కూడా అంతే ఎస్సీ వర్గాల్లో నాయకులు దొరకట్లేదు టీడీపీకి. వేరే వర్గాల వారినే చంద్రబాబు అలాగే కొనసాగిస్తుండటంతో ఎస్సీ వర్గాలకు చెందిన వారు ఎదగట్లేదని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ కారణంగా టీడీపీని చాలామంది ఎస్సీ నేతలు వీడుతున్నారంట. ఇలాగే పరిస్థితి కొనసాగితే మాత్రం చాలా వరకు రాబోయే ఎన్నికల్లో కేండిడేట్లు కూడా దొరకరు టీడీపీకి.