ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..!

-

ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. రేపు అసెంబ్లీలోకి బిల్లు రానుంది. మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగి రిటైర్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలి. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్‌ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు ఊడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్‌ అయ్యేలా చూడాలి.

రిటైర్‌ అయిన పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్‌ మెంట్‌ కింద కూడా ప్రయోజనాలు అందేలా చూడాలని.. ఈమేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. క్యాబినెట్ తర్వాత మంత్రులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ దసరా పండుగ విశాఖలోనే ఒన్ నేషన్, ఒన్ ఎలక్షన్ పై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండండి. అవసరమైతే అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అవినీతి స్కాం ల పై చర్చిద్దాం. అసెంబ్లీ సమావేశాలను అందరూ సీరియస్ గా తీసుకోవాలి. విశాఖలో కార్యాలయాల నిర్ధారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు కు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news