మాజీ ఎంపీ నందిగం సురేష్ పై అక్రమ కేసులు పెట్టారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జైలులో సురేష్ ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టులో ఉన్న లొసుగులు ఉపయోగించి వైసీపీ నేతలను జైలులో ఉంచుతున్నారని ఆరోపించారు. జైలులో మాజీ ఎంపీ కి కనీస సదుపాయాలు కల్పించలేదని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ని లేకుండా చేయాలని చూస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. అటు పేర్ని నాని దాఖలు చేసిన పిటిషన్ ను విత్ డ్రా చేసుకోవాలని పేర్కొంది హైకోర్టు. పోలీసులు నోటీసులు ఇస్తే.. విచారణకు హాజరు కావాలని పేర్కొంది.
ప్రస్తుతం టీడీపీ వ్యవహరించినట్టు మేము వ్యవహరించి ుంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునే వాళ్లం. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెల్లింది. జైలులో కనీసం వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్ ను ఎలా ఉంచాలి..? అనేది చెబుతున్నారు. ఇవన్నీ మౌనంగానే భరిస్తున్నాం. వైసీపీ నేతలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు.