డిసెంబర్ 04న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళా మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు అల్లు అర్జున్ కారణం అని అరెస్ట్ చేయగా.. హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ చిక్కడపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో దాదాపు 2 గంటల 40 నిమిషాల పాటు విచారణ చేపట్టారు. అల్లు అర్జున్ స్టేట్ మెంట్ ని రికార్డు నమోదు చేసారు పోలీసులు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఘటనకు ఎవరు కారణమయ్యారని విచారణ చేపట్టారు పోలీసులు. విచారణలో భాగంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీని అరెస్టు చేశారు చిక్కడపల్లి పోలీసులు. బౌన్సర్ ఆంటోనీని సంధ్య థియేటర్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకురానున్నారు పోలీసులు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా ఆంటోనీని గుర్తించారు పోలీసులు. ఎక్కడ ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పని చేస్తున్నారు ఆంటోనీ.