చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయింది. విచారణ పూర్తి కావడంతో పోలీస్ స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి పోలీస్ బందోబస్త్ మధ్య బయలుదేరారు అల్లు అర్జున్. దాదాపు 2గంటల 40 నిమిషాల సమయంలో సుమారు 50 ప్రశ్నల వరకు ప్రశ్నించినట్టు సమాచారం. అల్లు అర్జున్ స్టేట్ మెంట్ రికార్డు చేశారు. డిసెంబర్ 04న 9.30 గంటల నుంచి సంధ్య థియేటర్ వద్ద నుంచి బయటికి వెళ్లేంత వరకు అసలు ఏం జరిగింది అని ప్రశ్నించారు.
మీరు రూప్ టాప్ పై ఎందుకు ఎక్కారు.. రేవతి అనే మహిళా చనిపోయినట్టు ఆరో మీకు తెలియదా..? మిమ్మల్ని పోలీసులు తీసుకువెళ్లలేదా..? అని ప్రశ్నించగా.. ఆ ప్రశ్నలకు నోరు మెదపకుండా ఉన్నారు. కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పారు అల్లు అర్జున్. పోలీసుల విచారణ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడకుండా నేరుగా జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి పోలీసుల భద్రతతో వెళ్లిపోయారు.