చంద్రబాబు ఓ రావణాసురుడు లాంటివాడు – వైసీపీ ఎమ్మెల్యే

0
112

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి. జగనన్న నాయకత్వంలో పని చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉందని.. జగనన్న ప్రభుత్వం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిందని వెల్లడించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నిర్దేశించిన సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిందన్నారు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.

ప్రస్తుతం ఒక్క రాప్తాడు నియోజకవర్గానికే రూ.116 కోట్ల పంటల బీమా అందించడం పట్ల సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు అని…చంద్రబాబు రావణుడి లాంటివాడని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు హయాంలో ఒక్క సంక్షేమ పథకాన్నీ తీసుకు రాలేదు. పైగా ఏకంగా రూ.3 లక్షల కోట్లు మాయం చేశారని వివరించారు. వైసీపీ పార్టీ తోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందని.. జగన్‌ మోహన్‌ రెడ్డి సంక్షేమ పాలనను ఏపీ ప్రజలందరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.