ప్రకాశం బ్యారేజీ వద్ద ముగిసిన బోట్ల తొలగింపు ప్రక్రియ..!

-

ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ముగిసింది. అయితే ఈ మధ్యే ఏపీలో కురిసిన భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున వార్ధా వచ్చిన విషయం తెలిసిందే. రికార్డ్ లెవల్లో 11 లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చింది. ఆ క్రమంలోనే వరదల్లో బొట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను గుద్దిన విషయం తెలిసిందే. అయితే వరద తగ్గిన తర్వాత వాటిని తొలగించే పని ప్రారంభించిన ఇంజనీర్లు ఈ రోజు పూర్తి చేసారు.

బెకెం కంపెనీ ఇంజనీర్లు, సీ లయన్ డైవింగ్ టీం, కాకినాడ అబ్బులు టీంల సంయుక్త ఆపరేషన్ ఇది. మూడు బోట్లను విజయవంతంగా తొలగించారు. H బ్లాక్ ఆపరేషన్ మరోసారి సక్సెస్ అయ్యింది. ఇది రేపు ప్రకాశం బ్యారేజీ ఇనస్పెక్షన్ చేయనున్నారు ఇంజనీర్లు. బ్యారేజీ మెయింటెనెన్స్ ను పరిశీలించనున్న ఇంజనీర్లు.. గేట్లు, చైన్ లింక్ లు, హాయిస్ట్, కౌంటర్ వెయిట్ ల లైఫ్ చెక్ చేయనున్నారు. అలాగే ఇంకా ఏవైనా బోట్లు నీటి అడుగున ఉన్నాయా అనే అనుమానం నివృత్తి చేసుకోనున్నాయి టీంలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version