ఏపీ ప్రజలకు శుభవార్త..ఎల్లుండి నుంచి టిడ్కో ఇళ్ల పంపిణీ చేయనుంది జగన్ సర్కార్. పట్టణాల్లోని పేదలకు ఇప్పటికే 82,080 టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం…. ఎల్లుండి నుంచి మరో 61,684 ఇళ్లను అందజేయనుంది. 88 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఇళ్ల పంపిణీ జరగనుంది.
300 చదరపు అడుగుల ఇంటిని రూ. 1కే లబ్ధిదారులకు అందించనుంది. ఈ నెల 4న అనకాపల్లి జిల్లాతో మొదలుపెట్టి ఫిబ్రవరి రెండో వారంలో పార్వతీపురం జిల్లాతో పంపిణీని ముగించనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన విద్యుత్ సంస్థలకు అందించే ‘ఫాల్కన్ మీడియా – ఎనర్షియా ఫౌండేషన్’ జాతీయ అవార్డులను ఏకంగా మూడింటిని ఏపీ విద్యుత్ సంస్థలు పొందాయి. ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ ట్రాన్స్ కో ) కు ‘టాప్ స్టేట్ యుటిలిటీ ఫర్ ఎనర్జీ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్’ అవార్డు లభించింది.