పులులు ఎప్పుడూ పందులతో పోటీ పడవు: అయ్యన్నకు విజయసాయి కౌంటర్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ టిడిపి గా సాగుతున్న వార్ ఇప్పుడు ట్వీట్ల రూపంలో మరింతగా ముదిరిపోయింది. దీంతో వీరి ట్వీట్ల వార్ రాబోయే రోజుల్లో ఏ స్థాయికి వెళ్తుందో అర్థం కావడం లేదు. అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేతతో ప్రారంభమైన ఈ మాటల యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. విజయసాయిరెడ్డిని నర్సీపట్నం వస్తే తేల్చుకుందామని సవాల్ విసిరిన అయ్యన్నకు టైము, డేటు చెప్పాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి అయ్యన్నపాత్రుడు చేసిన సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.

అయితే పులి అయితే పోలీసులు లేకుండా సింగిల్ గా రావాలని విజయసాయిరెడ్డికి ఆయ్యన్న సవాల్ విసిరారు. దీంతో విజయసాయిరెడ్డి తీవ్ర పదజాలంతో అయ్యన్నపాత్రుడు పై విరుచుకుపడ్డారు. ఇంకో తరం మీరు అధికారంలోకి వచ్చేది లేదు- పీకేది లేదు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తాజాగా మరోమారు అయ్యన్నపాత్రుడు ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి. పులులు ఎప్పుడూ పందులతో పోటీ పొడవు అంటూ అయ్యన్నపాత్రుడుని పందితో పోల్చారు. నీ బతికే గంజాయి.. అది పీల్చి పీల్చి పిచ్చెక్కి వాగుతూ పోలీసులు వస్తేనే దాక్కుంటున్నావు అంటూ అయ్యన్నపాత్రుడుని తిట్టిపోశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version