ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా ఇవ్వండి : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

-

  1. ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా ఇవ్వండని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో పేర్కొన్నారు. రైతు భరోసా పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులందరికీ రైతు భరోసా అందించాలని.. ప్రధాని మోడీ పీఎం కిసాన్ నిధులను అలాగే ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం పత్తికి మార్కెట్ లో ధర లేదు. సీసీఐ పత్తి కొనకుంటే లక్షల మంది రైతులు రోడ్డున పడేవారు. కేంద్ర సాయంతో 1.20 కోట్ల టన్నుల పత్తిని సీసీఐ తీసుకుంది.సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా లేదు.

పీఎం కిసాన్ ద్వారా వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కేంద్రం ఇస్తోంది. మోడీ ఇస్తున్న పైసలు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి మాత్రం పైసలు రావడం లేదని రైతులు మాట్లాడుకుంటున్నారు. జనవరి నుంచి రైతు భరోసా ఇస్తామంటున్నారు సంతోషం. టమాట ధర రూ.15కి పడిపోయింది. రైతు ఈ నాటికి సంతోషంగా లేడు. రైతుల పిల్లలు కార్పొరేట్ స్కూల్ లో చదివినా.. ఆస్పత్రికి వెల్లినా 90 శాతం భారం ప్రభుత్వమే భరించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version