సర్వీస్ హోం గార్డ్ మరణిస్తే ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించారు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు. అక్టోబర్ 21 న సంస్మరణదీన కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహిస్తున్నామని… ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. అక్టోబర్ 21 నుండి 31 వరకు పదిరోజులు సంస్మరణ దినోత్సవాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. 31 న జాతీయ ఐక్యత దినం వరకు జరుపుతామన్నారు. 21 న నివాళులు దేశం లో అమరులైన అందరి పేర్లు చదువుతామని వివరించారు.
అమరుల కుటుంబాలను సీనియర్లు అధికారులతో పరామర్శిఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నారు. స్కూల్స్ లో అవగాహన కార్యక్రమాలు ఉంటాయని… ఓపెన్ హౌస్ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. వ్యాసరచన,వకృత్వం పోటీల నిర్వహణ ఉంటుందని తెలిపారు. రక్త దాన శిబిరాలు, మెడికల్ క్యాంపు లు చేపడతామన్నారు. పోలీసు ఆరోగ్య భద్రత సంక్షేమం కార్య క్రమమని… 1999 లో ప్రారంభం అయిందన్నారు. ఒక్కరికోసం అందరూ అందరికోసం ఒక్కరూ అనే స్ఫూర్తి తో ప్రతి నెల కొంత సాయం చేయడం ద్వారా చేపడుతున్నామని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు.