తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు ముగియనుండటంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో తిరుమలేశుడి సన్నిధిలో రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనానికి 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
నిన్న మొత్తం శ్రీవారిని 62,161 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారికి 28,923 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం రోజున శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.35 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వేసవి కాబట్టి మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉంచామని వివరించారు. వేసవి సెలవులు ముగియడానికి వస్తున్న నేపథ్యంలో ఈ వారం భక్తుల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.