ఢిల్లీ పార్లమెంట్ వద్ద కలకలం.. పార్లమెంట్ లోకి చోరబడేందుకు ముగ్గురు యత్నం..!

-

భారతదేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నకిలీ ఆధార్ కార్డుతో పార్లమెంటులోకి ప్రవేశించేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గేట్ నెంబర్ 3 నుంచి లోనికి వెళ్లేందుకు యత్నించగా.. అనుమానం రావడంతో అక్కడి భద్రతా సిబ్బంది ఖాసిం, మోనిస్, షోయబ్ లను అరెస్ట్ చేశారు. కాగా ఈ రోజు ఢిలీలో పలు కీలక సమావేశాలు, ఎంపీలతో ఎన్డీఏ కూటమి సమావేశాలు ఉన్నాయి.

ఈ క్రమంలో ఇలా జరగడంపై అధికారులు అలర్ట్ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని స్టేషన్ కు తరలించి.. ఎందుకు పార్లమెంట్లోకి చొరబడాలనుకున్నారని విచారిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news