TTD : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల టికెట్స్ ఇవాళ విడుదల కానున్నాయి. నేడు ఆన్‌లైన్‌లో మే నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. . మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల కానున్నాయి.
కాగా, తిరుమలలో ఇవాళ కుమారధార తీర్థ ముక్కోటి ఉంది. దింతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు అనుమతి ఇస్తారు. సాయంత్రం పౌర్ణమి గరుడ వాహన సేవ ఉండనుంది. ఇక ఇవాళ రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.