తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఇవాళ, రేపు భారీ వర్షాలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తగ్గట్టుగానే ఇవాళ ఉదయం నుంచి మబ్బులు కనిపిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

telangana rain on feb 24th

మరోవైపు నల్గొండ, ఖమ్మం మినహా మిగతా జిల్లాలలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదు అవుతాయని పేర్కొంది. హైదరాబాద్ మహానగరం, ఖమ్మం మహబూబ్నగర్ జిల్లాలలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపింది. అటు రాత్రిపూట… చల్లటి గాలులు విపరీతంగా వేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news