నేడు సీఎం చంద్రబాబు సొంతింటి శంకుస్థాపన

-

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8.51 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజలో పాల్గొననున్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక ఈ-9 రోడ్డులో 5.25 ఎకరాలలో ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఓ రైతు నుంచి ఆ భూమిని కొనుగోలు చేశారు. భూమి చదును పనులు నిన్నటికీ పూర్తి అయ్యాయి. జీ ప్లస్ వన్ గా ఇంటిని నిర్మిస్తారని తెలుస్తోంది.

ఏడాదిన్నర కాలంలో పనులు పూర్తి కావాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. వచ్చే ఏడాది చివరి వరకు గృహ ప్రవేశం చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులు ఈనెల 11న కడప ఒంటిమిట్టకు వెళ్లి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అక్కడ జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో సీఎం పాల్గొంటారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. తిరిగి టీటీడీ గెస్ట్ హౌస్ కి చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు చంద్రబాబు. 

Read more RELATED
Recommended to you

Latest news