చెన్నై చెత్త రికార్డులు.. కారణం అతడే..!

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా నిన్న పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పోరాడి ఓడిన విషయం తెలిసిందే. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. యువ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య 103 మెరుపు సెంచరీతో కదం తొక్కాడు. అతనికి తోడు శశాంక్ సింగ్ 52 నాటౌట్, జాన్సెన్ 34 నాటౌట్ సత్తా చాటారు.

అనంతరం ఛేదనలో చెన్నయ్ 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. కాన్వె 69, శివమ్ దూబె 42, రచిన్ రవీంద్ర 36, ధొనీ 27 పోరాడినా ఫలితం దక్కలేదు. 180కి పైగా టార్గెట్ ఉన్న మ్యాచ్ లో చెన్నైకి ఇది వరుసగా 11వ ఓటమి కావడం విశేషం. చివరి సారి 2018లో ఛేజ్ చేసింది. ఈ 11 మ్యాచ్ లలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గైక్వాడ్ కేవలం ఒ పిప్టీ కొట్టి 8 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. అతనే వరుస పరాజయాలకు కారణమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన గత ఏడు మ్యాచ్ లలో చెన్నై ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news