Fact Check: ఏపీలో బైక్‌లు, ఆటోలకు టోల్ ఫీజ్ వసూలు…క్లారిటీ వచ్చేసింది !

-

Toll fee collection for bikes and autos in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాహనదారులకు బిగ్ అలర్ట్. బైక్లు అలాగే ఆటోలకు టోల్ ఫీజులు వసూలు చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఈ వార్తను వైసీపీ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు నేతలు. ఆదాయం పెంచుకునేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం… టూవీలర్ అలాగే ఆటోలకు కూడా టోల్ ఫీజులు వసూలు చేసేందుకు సిద్ధమైందని ప్రచారం చేస్తుంది వైసిపి.

Toll fee collection for bikes and autos in AP

అయితే దీనిపై వెంటనే తెలుగుదేశం సోషల్ మీడియా అలాగే ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీం కూడా స్పందించింది. ఏపీలో ఎలాంటి టోల్గేట్ చార్జింగ్ పెంచలేదని వివరించింది. అంతేకాకుండా ఆటోలు మరియు బైకులకు టోల్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని… క్లారిటీ ఇచ్చాయి. ఫేక్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన పేటీఎం బ్యాచ్… బాగా తప్పుడు వార్తలు ప్రచారం… ఆ వార్తలను ఏపీ ప్రజలు నమ్మకూడదని టిడిపి సోషల్ మీడియా కోరింది. కాగా ఎక్కడైనా దేశవ్యాప్తంగా… ఫోర్ వీలర్ నుంచి అన్ని వాహనాలకు టోల్ ఫీజులు వసూలు చేస్తారు. బైక్ అలాగే ఆటోలకు టోల్ ఫీజులు ఉండవు అన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news