దారుణం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ అత్యాచారం

-

రాష్ట్రంలో గత మూడ్రోజుల వ్యవధిలోనే ఐదుగురు మహిళలపై అత్యాచారాలు జరిగాయి. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ వర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పుప్పాలగూడలో ఓ కంపెనీలో యువతి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. తెలిసిన యువతి ద్వారా షార్ట్ఫిల్మ్ డైరెక్టర్ సిద్ధార్థ్‌ వర్మ ఆమెను పరిచయం చేసుకుని మాట కలిపాడు. ఈ క్రమంలోనే తనకు సినిమాల్లో ఛాన్స్‌ ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. సదరు యువతిని బుధవారం రోజున డిన్నర్‌కి రావాలని తన ఇంటికి పిలిచాడు. ఇంటికొచ్చిన యువతికి కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించి ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి బాధిత యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news