ఇంత దారుణమా.. కిలో టమాటా.. 50 పైసలే

-

మొన్నటిదాక టమాట ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు చుక్కలు చూపించాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతే.. కొంత మంది రైతులు లక్షధికారులు.. మరికొంత మంది కోటీశ్వరులయ్యారు. కానీ ఇప్పుడు ఆ సమయం పోయింది. మొన్నటిదాక చుక్కలనంటిన టమాట ధర ఒక్కసారిగా నేల మీద కుప్పకూలిపోయింది. నిన్నటి దాక రూ.250, రూ.300 వరకు ఉన్న ధర ఇప్పుడు కనీసం అర్ధరూపాయి కూడా లేదు.

ముఖ్యంగా ఏపీలో టమాట ధరలు బాగా పడిపోతున్నాయి. కిలో టమాటా 50 పైసలుగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొనే వారు లేక టమాటలను పశువులకు పెడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో ఆదివారం కిలో టమాట రూ.50 పలికింది. మంచి దిగుబడి వచ్చినప్పుడే ధరలు ఇలా పడిపోవడంతో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. నిన్న, మొన్నటి వరకు రూ.3 పలికిన ధర.. ఆదివారం కనిష్ఠ స్థాయికి చేరింది. పత్తికొండ ప్రాంతంలో చాలా మంది రైతులు ఖరీఫ్‌లో టమాటా సాగు చేశారు. ఒక్కో కూలీకి రూ.300 చెల్లించి పంటకోసి మార్కెట్‌కు తెస్తే వ్యాపారులు తక్కువ ధరకు కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news