ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి సతీమణి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. పార్వతమ్మ మరణం మాగుంట కుటుంబంలో విషాదం నింపిందన్నారు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి.
పార్మతమ్మ తనకు తల్లితో సమామని.. ఆమె మరణం తీరని లోటని తెలిపారు. ఏప్రిల్ నెలలో మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఐదు నెలల్లోనే పార్వతమ్మ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. పార్వతమ్మ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ముఖ్యంగా తమ
కుమారుడి మరణం తర్వాత మాగుంట పార్వతమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఇటీవలే ఆమెను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పార్మతమ్మకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.. మంగళవారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం మరణించిందని వైద్యులు వెల్లడించారు.