తెలంగాణ రైతులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రైతుబంధు విషయం పైన తాజాగా వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేయడం జరిగింది. రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. రైతు బంధు నిధులు విడుదల చేయడంపై… ఓ నిర్ణయానికి వస్తామని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. అప్పటివరకు రైతుబంధు లేనే లేదు అన్నట్లుగా ఆయన వ్యవహరించడం జరిగింది. దీంతో తెలంగాణ రాష్ట్ర రైతులు తీవ్ర నిరాశకు ఎదురవుతున్నారు.
వాస్తవంగా ఇప్పటికే వర్షాకాలం రైతుబంధు నిధులు విడుదల చేయాల్సి ఉండేది. కానీ యాసంగి వచ్చిన కూడా ఆ డబ్బులను రిలీజ్ చేయలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు యాసంగి వచ్చింది కాబట్టి రెండు సీజన్లో డబ్బులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడింది. అయితే రైతుబంధు నిధులు పడకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దసరా లోపు అయిన డబ్బులు వస్తాయనుకుంటే తుమ్మల ప్రకటనతో మరింత ఆందోళన చెందుతున్నారు రైతులు.